‘ఘని’ గొడవలు ఏంటీ ?

కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఘని’. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.  అల్లు బాబి, అతడి స్నేహితుడు సిద్దు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఐతే ఈ సినిమా విషయంలో సమస్యలు వస్తున్నట్టు సమాచారమ్. నిర్మాతల మధ్య అంతగా పొసగడం లేదని టాక్. 

కథ విషయంలో నిర్మాతలు అంత సంతృప్తిగా లేకపోవడం, తరచు మార్పులు చేర్పులు చేయిస్తుండడంతో దర్శకుడు కూడా విసుగెత్తిపోయాడట. ఇలా అయితే కష్టమని చెప్పేశాడట.  ఇదిలా వుంటే హీరో సూచన మేరకు యాభై లక్షలతో భారీ సెట్ వేసారు కానీ దాన్ని షూట్ చేయకుండానే తీసేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని వినికిడి. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు ఎలాంటి సమస్య లేదు. హీరోకు చేయి ఇబ్బంది పెట్టడం వల్ల సెట్ లో షూట్ చేయకుండానే తీసేయాల్సి వచ్చిందని చెప్పారు.