రస్మిక ప్రేమలో పడిందా ?

హీరోయిన్ రష్మిక మందన సడెన్ షాక్ ఇచ్చింది. తాను త‌మిళ ఇంటి కోడ‌లు కావాల‌నుకుంటున్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో రస్మిక ప్రేమలో పడిందా ? ఆమెకు కోలీవుడ్ హీరో నచ్చేశాడా ? అనే చర్చ మొదలైంది. ఇప్పుడిప్పుడే త‌మిళంలో అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటోంది రస్మిక. బహుశా.. ఆఫర్ల కోసమే రస్మిక తమిళ ఇంటికోడలు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటుంది. 

తొలి సినిమా తర్వాత క‌న్న‌డ హీరోతోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవ‌డం, తెలుగులో అవ‌కాశాల‌తో బిజీ అయ్యాకా ఆ ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తమిళ్ లో అవకాశాల కోసం ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

రస్మిక స్టేట్ మెంట్ విజయ్ దేవరకొండ అభిమానులని కూడా తీవ్రంగా నిరాశపరిచి ఉంటుంది. విజయ్-రస్మికల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే రూమర్స్ ఉన్నాయ్. అవి నిజం కావాలని విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో రస్మిక తాను తమిళ్ కోడలు కావాలనుకుంటున్నా.. ఇక్కడి ఫుడ్ నాకు బాగా నచ్చిందని స్టేట్ మెంట్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం రస్మిక పుష్ప సినిమాలో నటిస్తోంది.