తారక్ హెల్త్ అప్ డేట్
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు కరోనా బారినపడుతున్నారు. సెకండ్ వేవ్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. తదితరులు బారినపడ్డారు. వీరిలో పవన్, బన్నీ ఇప్పటికే కోలుకోగా, తారక్ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు.
తాజాగా ప్రేక్షకులకి ట్విట్టర్ వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలియజేసిన తారక్.. తన హెల్త్ అప్ డేటు కూడా ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగవుతోంది. త్వరలోనే నెగెటివ్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయనున్నారు.
Wishing everyone a happy Eid. Thank you one and all for your warm wishes and prayers. I am getting better and hope to test negative soon. Stay safe and take care.— Jr NTR (@tarak9999) May 14, 2021