ఆర్ఆర్ఆర్ అరెస్ట్ !
RRRగా ఈ మధ్య పాపులర్ అయిపోయాడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇటీవల దూకుడు పెంచాడు. ఏపీ సీఎం జగన్, ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియా లైవ్ లో జగన్ అండ్ కో పై సటైర్స్ వేస్తున్నారు. తనని ఏం పీకలేరంటూ.. వార్నింగ్ ఇస్తున్నారు.
తాజా ఆర్ఆర్ఆర్ కు సీఐడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది.. భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. బర్త్ డే రోజునే ఆర్ఆర్ఆర్ ని అరెస్ట్ చేయడం గమనార్హం.
ఆర్ ఆర్ ఆర్ అరెస్ట్ పై ఆయన కొడుకు భరత్ ఆందోళన వ్యక్తం చేశారు. మఫ్టీలో వచ్చింది సీఐడీ అధికారులా.. రౌడీలా అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. ‘ముందస్తు ప్రణాళిక ప్రకారం అకస్మాత్తుగా వచ్చి మా మాన్నను తీసుకెళ్లారు. వై కేటగిరీ భద్రత ఉన్న ఎంపీని బలవంతంగా తీసుకెళ్లారు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగి మూడు నెలలే అయ్యిందని వాపోయారు.