బ్లాక్ ఫంగస్’పై కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు, సలహాలు
కొవిడ్ వేళ.. బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది. కొవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్ల మోతాదు మించి వాడిన వారిలో, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదో ముప్పుగా పరిణమించింది. దీనిపై అప్రమత్తంగా ఉండే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్ వేదిక పలు సూచనలు, సలహాలు చేసింది.
‘మ్యుకర్‌మైకోసిస్‌ను బ్లాక్‌ఫంగస్‌గా కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో దీన్ని కొంతమంది కొవిడ్ రోగుల్లో గుర్తించాం. అవగాహన, ప్రారంభంలోనే రోగ నిర్ధారణ ఈ బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని అరికట్టడానికి దోహదం చేస్తాయి’ అంటూ ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలివే :
* కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి,
* ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి
* దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు
* మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం