ట్రెండ్ సెట్ చేసిన ‘రాధే’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి’. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దిశా పటానీ కథానాయిక. జీ స్టూడియోస్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన సినిమాకి అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ నిర్మాతలు. ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ఓటీటీలో విడుదలైంది. ఈద్ కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జీ ప్లెక్స్, డిష్ టీవీల్లోనూ ‘రాధే’ అందుబాటులో ఉంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ట్రెండ్ సెట్ చేసింది.
ఇన్నాళ్లు భారీ బడ్జెట్ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వెనకాడేవారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్ కష్టం. ఇప్పుడా సందేహాలు, సమస్యలకు రాధే చెక్ పెట్టాడు. ఒకేసారి ఇటు ఓటీటీలో, అటు అందుబాటులో ఉన్న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్స్ రాబడుతోంది.
తొలిరోజే రాధే రూ. 100కోట్ల బిజినెస్ చేయడం విశేషం. తొలిరోజే రాధే 4.2మిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనందం వ్యక్తం చేసారు. దీంతో.. పెద్ద సినిమాలకు ఓ మార్గం చూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటీటీలో రాధే ట్రెండ్ చేసింది. రాధే స్పూర్తితో ఇకపై పెద్ద సినిమాలు ఓటీటీలోకి క్యూ కట్టే అవకాశాలున్నాయి.