ఓటీటీ కథలు.. భలే గిరాకీ !
కరోనా లాక్ డౌన్ తో మరోసారి సినీ పరిశ్రమ మూగబోయింది. థియేటర్స్ మూతపడ్డాయ్. సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీంతో సినిమా వాళ్లు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటున్నారు. ఐతే దర్శకులకి మాత్రం ఇది బ్రేక్ టైమ్ కాదు. కొత్త కథలని రాసుకుంటున్నారు. ప్రస్తుతం ఓటీటీ కథలకి మంచి గిరాకీ ఉంది. మంచి కథలు రాసుకొని ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు. టాప్ దర్శకులు, యువ దర్శకులు అనే తేడానే లేదు. ఐడీయా ఉంటే చాలు.. డబ్బే డబ్బు.
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ .. ఇప్పుడు హాట్ స్టార్ కోసం ఓ కథ అందించాడట. ప్రశాంత్ వర్మ అందించిన కథతో హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఓటీటీలకు సరిపడా మరో రెండు కథలు తన దగ్గర సిద్ధంగా ఉన్నాయని, ఒకటి హిందీలోనూ, మరోటి తెలుగులోనూ రాబోతోందని ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఇక ప్రశాంత్ వర్మ దగ్గర సోషియో ఫాంటసీ కథ ఉందట. అది తన తదుపరి సినిమాగా తీసుకొస్తానని తెలిపారు. ఇందులో హీరో-హీరోయిన్ ఎవరు ? అన్నది మాత్రం చెప్పలేదు.