పుష్ప రెండు భాగాలు.. ఇద్దరు హీరోయిన్స్ ?

బన్నీ-సుకుమార్ ల హ్యాట్రి చిత్రం ‘పుష్ప’. సింగిల్ సినిమాగా స్క్రిప్ట్ రెడీ అయిన పుష్ప.. ఇప్పుడు రెండు భాగాలైంది. సినిమా లెన్త్ పెరగడం వలన తీసుకున్న నిర్ణయం ఇదని తెలిసింది. ఎర్రచందనం కూలీ ఓ మాఫియా డాన్ గా ఎదిగిన తరువాత రెండో భాగం మొదలవుతుందని, తొలిభాగం రగ్డ్ గా రఫ్ గా వుంటే, మలి భాగం అల్ట్రా స్టయిలిష్ గా వుంటుంది. ఐతే ఇప్పటి వరకు అనుకున్న రష్మిక కాకుండా మలిభాగంలో మరో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసే పని ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ఉన్నారని సమాచారమ్. 

మరీ.. ఆ అవకాశం ఏ హీరోయిన్ కి దక్కనుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఇద్దరు హీరోయిన్స్ కాకుండా ఐటమ్ బ్యూటీ ఉండనుంది. గతంలో పుష్ప ఐటమ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ పేరు బలంగా వినిపించింది. మరీ.. ఫైనల్ గా పుష్ప ఐటమ్ ఎవరు అవుతారు అన్నది చూడాలి. పుష్ప తొలి భాగం ఈ యేడాది.. రెండో భాగం వచ్చే యేడాది రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్రబృందం ఉంది.