బర్త్ డే సెలబ్రేషన్స్ : ఫ్యాన్స్ కు తారక్ బహిరంగ లేఖ
మే 20 – యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. ఐతే ఈ సారి బర్త్ డే సెలబ్రేషన్స్ దూరంగా ఉండాలని అభిమానులని కోరారు తారక్. అభిమానులకు తారక్ బహిరంగ లేఖతన పుట్టినరోజు నాడు ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. వేడుకలకు ఇది సరైన సమయం కాదని.. ప్రతిఒక్కరూ లాక్డౌన్ నియమాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖని విడుదల చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఇందులో కొమరంభీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. ఆయనకు జంటగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్చరణ్ మరో కథానాయకుడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది.