కేసీఆర్ వచ్చాడు.. కేసులు తగ్గాయ్ !
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3837 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది మృతి చెందారు. ఇటీవల నమోదవుతున్న కేసులతో పోలీస్తే.. స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక 976 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 46,946 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 90.75శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలని పూర్తిస్థాయిలో స్వీకరించినట్టున్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. స్వయంగా కరోనా రోగులతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని తెరాస వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేసీఆర్ అంటేనే ఓ ధైర్యం అంటూ కొటేషన్స్ తో కొడుతున్నారు. మరీ.. ఇన్నాళ్లు ఆ ధైర్యం ఎక్కడకుపోయింది. ఏడ పడుకుంది ? అంటూ.. వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తున్నాయి.
మొత్తానికి.. తాజాగా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాల క్రిడిట్ కూడా సీఎం కేసీఆర్ ఖాతాలో వేసేలా ఉన్నారు. కేసీఆర్ వచ్చాడు.. కోవిడ్ ఆసుపత్రులని సందర్శించారు. అందుకే కేసులు తగ్గుతున్నాయని గొప్పలు చెప్పుకుంటారేమో.. !