సమంత ఉగ్రవాది.. చాలా లేయర్స్ ఉంటాయ్ !

సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్‌2’.  సౌత్ నుంచి బయటకొచ్చి సమంత చేసిన మొట్టమొదటి ప్రాజెక్టు కూడా ఇదే. ఈ వెబ్ సిరీస్ కు రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈరోజు రిలీజైన ఫ్యామిలీమేన్ ట్రయిలర్ లో ఉగ్రవాది రాజీ పాత్రలో కనిపించింది సమంత. అయితే తన పాత్ర కేవలం టెర్రరిస్ట్ రోల్ వరకు మాత్రమే పరిమితం కాదని, చాలా లేయర్స్ ఉన్నాయని అంటోంది.

నేను రాజీ పాత్రను కేవలం ఉగ్రవాది పాత్రగానో, యాక్షన్ క్యారెక్టర్ గానో చూడడం లేదు. అంతకుమించి నా పాత్ర ఉంటుంది. దర్శకులు నా పాత్రకు ఎన్నో లేయర్స్ జోడించారు. సీజన్-2 చూసిన తర్వాత నా పాత్ర ఏంటనేది పూర్తిగా అర్థమౌతుంది అన్నారు సామ్. ఇద్దరు మేకర్స్ తో ఒకే ప్రాజెక్టు చేయడం కాస్త ఇబ్బంది అనిపించింది. ఒక సీన్ ను ఇద్దరూ చర్చించుకునే విధానం నాకు బాగా నచ్చింది. వాళ్లు చెప్పింది చేసుకుంటూ పోయానాని చెప్పుకొచ్చింది.