రేణు కరోనా సాయంపై విమర్శలు

కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న పేద‌ల‌కు ఆక్సిజ‌న్‌, బెడ్ త‌దిత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చారు నటి రేణు దేశాయ్. ఐతే ఆమె చేస్తున్న సాయంపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. ధ‌న‌వంతుల‌కే సాయం అందిస్తున్నార‌ని ఓ నెటిజ‌న్ విమ‌ర్శించారు. దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు రేణు.

“నాకు తోచినంత సాయం చేస్తున్నా. 10, 12 రోజులుగా చేస్తూ వస్తున్నాను. మీరు ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు, మీరు ఎన్నుకున్న లీడర్‌ను అసలే కాదు. ఈ ప‌నేదో  మీరు ఎన్నుకున్న లీడ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి నిల‌దీయండి. కొందరు హెల్ప్‌ చేస్తారా? లేదా? అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు, డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ధోర‌ణులు మంచి చేయాలన్న నా సంకల్పాన్ని దెబ్బ‌తీస్తున్నాయి. పొరపాటున మీ మెసేజ్‌ను వదిలేసుంటే మరొకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఓవైపు సాయాన్ని అర్థిస్తూ, మరోవైపు పనికిరాని చెత్త మెసేజ్‌లతో నా ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి” అని రేణూ దేశాయ్ రిప్లై ఇచ్చారు.