కేటీఆర్ అవసరంలేని ట్విట్

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ట్విట్టర్ వేదికగా వచ్చిన విజ్ఝప్తులపై ఆయన స్వీకరిస్తారు. వాటిని పరిష్కరిస్తారు కూడా. తాజాగా ఇలాంటి ఔషధాల పేర్లను గుర్తుచేస్తూ.. మంత్రి కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఇలా పలకడానికే కష్టంగా ఉన్న పేర్లను ఔషధాలకు ఎందుకు పెట్టారో మీకేమైనా తెలుసా? అంటూ సరదా ట్వీట్‌ చేశారు. అంతేకాదు వీటిలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నా అని ఛలోక్తి విసిరారు.

తాజాగా కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన శశిథరూర్‌, 29 అక్షరాలతో కూడిన మరో కఠిన ఆంగ్ల పదాన్ని ప్రయోగిస్తూ రీ-ట్వీట్‌ చేశారు. Floccinaucinihilipilification కఠిన పదాన్ని ప్రయోగించారు. ఆంగ్లభాషలో అతిపెద్ద పదాల్లో ఇదోకటి.దీనికి అవసరం లేని పని లేదా అలవాటు అని అర్థం. అంటే.. కేటీఆర్ అనవసర ట్విట్ (పని) చేశారని శశిథరూర్ గుర్తు చేశారు అన్నమాట. ఇప్పుడు.. నెటిజన్లు వారిద్దరి ట్వీట్‌లపై భిన్నంగా స్పందిస్తూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

Not guilty! How can you indulge in such floccinaucinihilipilification, @KTRTRS? Left to me I’d happily call them “CoroNil”, “CoroZero”, & even “GoCoroNaGo!” But these pharmacists are more procrustean…. https://t.co/YrIFSoVquo— Shashi Tharoor (@ShashiTharoor) May 21, 2021