ఈటెల తనయుడిని అరెస్ట్ చేస్తారా ?
సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ ని టార్గెట్ చేశారు. ఆయనపై వచ్చిన అసైన్డ్ భూముల ఆరోపణలపై జెడ్ స్వీడుతో స్పందించారు. విచారణకు కమిటీ వేశారు. ఈటెల అక్రమాలకు పాల్పడ్డారని నిర్థారించారు. 24 గంటల్లో ఈటెలని మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్. కొన్నాళ్లుగా నిరసనగళం వినిపిస్తున్న ఈటెలకు కావాలనే చెక్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈటెలని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ వలన ఆయనపై సానుభూతి మరింత పెరుగుతుంది. అది రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపుని మరింత ఈజీ చేస్తుందని అంచనా వేశారని సమాచారమ్.
ఈ నేపథ్యంలో ఈటెలని కాకుండా ఆయన తనయుడు నితిన్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. ఈటెల మాదిరిగానే ఆయన తనయుడు నితిన్ రెడ్డిపై ఆదివారం సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. తన భూమిని నితిన్ కబ్జా చేశారంటూ మేడ్చల్ మండలం రావల్‌కోల్ వాసి మహేశ్ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు విన్నవించుకున్నారు. మహేశ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎస్ సోమేశ్‌కుమార్, అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విజిలెన్స్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నితిన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారమ్. దాంతో.. ఈటెలని మరింత కుంగదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.