కాజల్ విత్ అవుట్ మేకప్
మేకప్ లేకుండా కనిపించే ధైర్యం హీరోయిన్స్ ఎవ్వరు చేయరు. ఒకవేళ చేసినా.. వారిని చూసే సాహాసం జనాలు చేయకూడదు. ఎందుకంటే ? విత్ అవుట్ మేకప్ హీరోయిన్స్ చూడలేం. చూసి తట్టుకోలేం. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే విత్ అవుట్ మేకప్ తో వారిని గుర్తుపట్టలేం. ఐతే గతంలో ఓసారి విత్ అవుట్ మేకప్ తో కనిపించి శభాష్ అనిపించుకుంది కాజల్. ఆమె ధైర్య సాహాసాలకు తోటి హీరోయిన్స్ సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తాజాగా మరోసారి అలాంటి సాహాసమే చేసింది చందమామ.
ఈసారి లైట్ మేకప్ తో ఫోటోలకి పోజులిచ్చింది. ఐతే జూమ్ కి వెళ్లలేదు. దీంతో కాజల్ అందగానే కనిపించింది. పెళ్లైన తర్వాత ఆమె సైజులు పెరిగాయని ఈ ఫోటోలతో అర్థమవుతోంది. ఇక పెళ్లి తర్వాత కూడా రాణిస్తున్న జాబితాలో కాజల్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఆమె ఆచార్య సినిమాలో నటిస్తోంది. భారతీయుడు సినిమాలోనూ కాజల్ నే హీరోయిన్. ఇవీగాక వెబ్ సిరీస్ లు చేస్తోంది. అటు ఫ్యామిలీ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.