RRR విడుదల నాలుగు రోజుల ఆలస్యం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (RRR)కు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయినా.. ఆయన విడుదల ఆలస్యం కానుంది. వాస్తవానికి శనివారమే ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాల్సి ఉంది. బెయిల్‌కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకు అందని నేపథ్యంలో.. విడుదుల సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ కూడా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కావడం లేదు. మరో నాలుగురోజుల పాటు వాయిదా పడనుంది.

 సికింద్రాబాద్ సైనికాసుపత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరి కోరారు. ఈ క్రమంలో ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని వైద్యులు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. దీంతో వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాతే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది.