కుర్రాళ్లు ఇరగదీశారు

‘గబ్బర్’ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో పవన్ అభిమానులని ఆకట్టుకున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్‌ని స్క్రీన్‌పై ఏవిధంగా చూడాలని ఓ అభిమాని కోరుకుంటాడో అంతే పవర్‌ఫుల్‌గా చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. సినిమాలోని విజువల్స్‌తోపాటు తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో అదిరిపోయాయ్. సినిమా స్థాయిని పెంచేశాయ్. ఫలితంగా థియేటర్స్ లోనూ ఓటీటీలోనూ వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాడు.

తాజాగా ‘వకీల్‌సాబ్‌’ సినిమాలోని ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ని రీక్రియేట్‌ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో తెరకెక్కించారు. సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్‌ సన్నివేశాలను కుర్రాళ్లు ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఈ వీడియోని గుంటూరు పవర్‌స్టార్‌ అభిమానులు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు థమన్ రీ ట్విట్ చేశారు. ‘కుర్రాళ్లు ఇరగదీశారు’ అంటూ కామెంట్ చేశారు.

Nellore Kurollu Chimpesaru Asalu Mamul Mass Kadhu

Interval Sentiment
Bathroom Fight
And Metro Train Fight 3 Mix Chessi Ramp 🔥🤙

Timing
Action
Stunts

Finaly Last Metro Bgm Ramp Anna @MusicThaman#VakeelSaab pic.twitter.com/sX6NUtPSzE— 𝙂𝙪𝙣𝙩𝙪𝙧 𝙋𝙖𝙬𝙖𝙣𝙆𝙖𝙡𝙮𝙖𝙣 𝙁𝘾 ™ (@Guntur_PSPKFC) May 23, 2021