కరోనా ఎఫెక్ట్.. మెగాస్టార్ సినిమా క్యాన్సిల్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత లూసీఫ‌ర్ రీమేక్ చేయాల్సివుంది. దర్శకుడు మోహ‌న్ రాజా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి రెడీగా ఉన్నారు. ఇంతలో ఆయనకు చిరు షాక్ ఇచ్చేలా ఉన్నాడని విశ్వసనీయ సమాచారమ్.

దీనికి కారణం లూసీఫ‌ర్ లో ద‌ర్శ‌కుడు చేసిన మార్పులూ, చేర్పులూ చిరుకి న‌చ్చ‌క‌పోవ‌డం, ఈ సినిమా నేటివిటీ తెలుగుకి అస్స‌లు మ్యాచ్ కాద‌న్న ఫీలింగ్ రావ‌డం మ‌రో కార‌ణంగా తెలుస్తోంది. ఇదీగాక కోవిడ్ విజృంభిస్తున్న వేళ పని భారాన్ని తగ్గించుకోవాలని చిరు నిర్ణయించుకున్నారట.

ఈ నేపథ్యంలో లూసీఫర్ రిమేక్ ని పక్కన పెట్టాలని దాదాపు ఫిక్సయినట్టు సమాచారమ్. ‘ఆచార్య‌’ త‌ర‌వాత కూడా చిరు కొంత‌కాలం విరామం తీసుకోవాల‌ని భావిస్తున్నాంట. అలాగని.. లూసీఫర్ రిమేక్ వార్తని ఇప్పటికిప్పుడు బయటికి లీక్ చేయకపోవచ్చు. అలా.. హోల్డ్ లో పెట్టేసి.. ఆ తర్వాత చెబుతారట.