31న ‘స‌ర్కారు వారి పాట‌’ టీజర్.. కానీ !

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ అలవాటు ఉంది. దాన్ని అలవాటు అనడం కన్నా బాధ్యత అనాలేమో. మే 31 – మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకి గిఫ్ట్ అందిస్తుంటాడు మహేష్. తన సినిమా రిలీజ్ లేదా టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. మరో వారంరోజుల్లోనే మే 31 రాబోతుంది. మరీ.. ఈ సారి మహేష్ నుంచి వచ్చే గిఫ్ట్ ఏంటీ అంటే.. ? సర్కారు వారి పాట టీజర్ అంటున్నారు. కానీ ఇందుకు చిత్రబృందం కష్టాలు పడుతుందని తెలుస్తోంది. 

ఎందుకంటే ? టీజ‌ర్ క‌ట్ చేసేంత ఫుటేజీ.. అందుబాటులో లేద‌ని టాక్‌. స‌ర్కారు వారి పాట‌కు సంబంధించిన కీల‌క‌మైన షెడ్యూల్ దుబాయ్‌లో సాగింది. 15 రోజుల పాటు జ‌రిగిన ఆ షెడ్యూల్ లో ఓ యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని తెర‌కెక్కించారు. దాంతో పాటు 15 నిమిషాలకు స‌రిప‌డేంత ఫుటేజీ తెర‌కెక్కించారు. అందుకే 30 సెక‌న్ల‌ గ్లింప్స్‌ని క‌ట్ చేసి, అందులో ఓ డైలాగ్ ని మిక్స్ చేసి వ‌దులుదామ‌ని భావిస్తున్నారట. ఇందుకు మహేష్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. దానికి మహేష్ నో అంటే మాత్రం.. కొత్త పోస్టర్ తో సరిపెట్టనున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట తెరకెక్కుతోంది. గీత గోవిందం తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించారు. ఆయనది సినిమాలో డ్యూయెల్ రోల్ అనే ప్రచారం కూడా ఉంది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.