లారీ డ్రైవ‌ర్’గా సప్తగిరి

కమెడియన్.. టాప్ కమెడియన్.. హీరో. హీరోగా ఒకట్రెండ్ హిట్స్. ఆ తర్వాత అన్నీ ప్లాప్లే. దెన్.. హీరో యూటర్న్ టు కమెడియన్. టాలీవుడ్ లో ఇది జరిగిందే. సునీల్ అదే చేశాడు. ఇప్పుడు సప్తగిరి అదే చేస్తున్నాడు. కొన్నాళ్లు స‌ప్త‌గిరి ట్రెండ్ న‌డిచింది. ఏ సినిమాలో చూసినా… త‌న కంటూ ఓ కామెడీ ట్రాక్ ఉండేది. అతడు హీరోగా టర్న్ తీసుకున్నాక.. త‌న కామెడీకి ప్రాధాన్యం త‌గ్గుతూ రావ‌డం జ‌రిగాయ్. ఐతే చాన్నాళ్ల తర్వాత సప్తగిరికి ఓ మంచి పాత్ర పడింది.

సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది. ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా మొత్తం ఫ‌న్ రైడ్ గా ఉంటుంద‌ని, సెకండాఫ్ లో స‌ప్త‌గిరి కామెడీ హైలెట్ గా మారింద‌ని సమాచారమ్. ఇందులో స‌ప్త‌గిరి.. హీరోకి స్నేహితుడిగా, ఓ లారీ డ్రైవ‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఆంధ్రాలో పుట్టి, పంజాబ్ లో సెటిలైపోయిన లారీ డ్రైవ‌ర్ స్నేహితుడి పెళ్లి కోసం హైద‌రాబాద్ రావ‌డం, స్నేహితుడికి ద‌గ్గ‌రుండి ఫ‌స్ట్ నైట్ జ‌రిపించాల‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఫ్లోలో సప్తగిరి ఫుల్లుగా నవ్విస్తారని తెలిసింది.