‘హరిహర వీరమల్లు’ టీజర్ ఎప్పుడంటే ?

అంతా బాగుంటే.. ఈ పాటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు క్యూ కట్టేవి. వకీల్ సాబ్ తర్వాత ‘హరిహర వీరమల్లు’ వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.నిధి అగర్వాల్‌ కథానాయిక. మొఘలులు, కుతుబ్ షాహిల నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభమై 15 రోజులు షూటింగ్‌ కూడా జరుపుకొంది. తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ ఎప్పుడు ? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. టీజర్‌ని పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్‌ 2న విడుదల చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అంతకంటే ముందు హీరోయిన్ నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ రాబోతుందట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేస్తారని సమాచారమ్. ఇక ఈ చిత్రానికి ‘ఆక్వామన్’, ‘వార్‌క్రాఫ్ట్’, ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు గ్రాఫిక్ పనులు పర్యవేక్షించిన బెన్ లాక్ ఈ సినిమాకి VFX బాధ్యతలను చూస్తున్నారు.