కరోనా థర్డ్‌వేవ్‌.. కేసీఆర్ కీలక ఆదేశాలు !

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు సంబంధిత అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

* ఫీవర్‌ సర్వే, మెడికల్‌ కిట్ల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోందని, దీనిని కొనసాగించాలి
* పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షల సంఖ్యను మరింతగా పెంచాలి
* బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు పడకలు, మందులు సమకూర్చుకోవాలి
* ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలి

  • కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
    * అన్ని పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మార్చాలి
    * రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని 600 టన్నులకు పెంచాలి
    * బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోంస ఆస్పత్రుల్లో పడకలు ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు 1,500 పడకలు ఏర్పాటు చేయాలి
    * మంగళవారం నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.