ప్రభుత్వం ఆధీనంలోకి ప్రైవేటు హాస్పటల్స్.. కరోనాకు ఫ్రీ చికిత్స !

తెలంగాణలో కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లోనే.. కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయ్. ఫైనల్ గా ప్రభుత్వం కూడా అందుకు ఓకే అనక తప్పలేదు. దీనిపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ దాన్ని ఇప్పటి వరకు అమలులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న నేపథ్యంలోనూ.. కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇలాంటి టైమ్ లో భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి.. కోర్టుకు వెళ్లారు.

తెలంగాణ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రైవేటులో కరోనా రోగుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అన్నది చూడాలి.