కొడుకుపై ఫిర్యాదుతో ఈటెల కమలం టర్న్ ?
తగ్గేదే లే.. అంటూ ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఉద్యమ నేతలు, కుల సంఘాలు, బీసీలని ఏకం చేస్తా అంటూ తన ప్రెస్ మీట్ తో కేసీఆర్ కు హెచ్చరికలు పంపారు. ఆ సామర్థ్యం, సహనం ఈటెలకు ఉంది కూడా. కానీ రాజకీయ వ్యూహాలు రచించడంలో, శత్రువులని చిత్తు చేయడంలో కేసీఆర్ మొనగాడు. ఆయన వ్యూహాలకు టైగర్లు, సూపర్ స్టార్స్ చిత్తయ్యారని చరిత్ర చెబుతోంది.
ఈటెల విషయంలోనూ కేసీఆర్ అలాంటి వ్యూహాలనే పన్నాడు. అదరని, బెదరని ఈటెల షాక్ అయ్యేలా ఆయన తనయుడుని టార్గెట్ చేశారు. తండ్రి (ఈటెల) మాదిరిగానే.. తనయుడు నితిన్ రెడ్డిపై భూ ఆక్రమణ ఫిర్యాదు సీఎం కేసీఆర్ కు అందింది. దానిపై వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. ఉద్యమకారులు, బీసీలు, కుల సంఘాలని ఏకం చేయాలి.. కొత్త పార్టీ పెట్టాలి.. కేసీఆర్ ని గట్టిగానే కొట్టాలని భావించిన ఈటెల ప్లాన్ మార్చేశారు.
ఆయన ఇప్పుడు కమలం టర్న్ తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపానే తనని, తన తనయుడిని కేసీఆర్ ని కాపాడ గలుగుతుందని నమ్ముతున్నట్టున్నాడు. సోమవారం ఈటెల బీజేపీ నేతలతో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఓ ఫాం హౌస్ లో ఈ భేటీ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత కిషన్ రెడ్డితో ఈటెల సమావేశం అయ్యారని ఈ ప్రచార సారాంశం.
ఈటెలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. ఇందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని పింక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజం లేకపోదు. తనని, తన తనయుడుని కూడా టార్గెట్ చేయడంతో.. ఈటెలని ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ బీజేపీ. ఇప్పుడీ.. ఆ ఆప్షన్ కే ఈటెల వెళ్లినట్టు అర్థమవుతోంది. మరికొద్దిరోజులు ఆగితే ఈటెల బీజేపీలో చేరడంపై ఓ క్లారిటీ రానుంది.