మీడియాపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి పెద్దన్న పాత్ర పోషించారు. సి.సి.సి సంస్థని స్థాపించి సినీ కార్మికులని ఆదుకున్నారు. ఐతే సెకండ్ వేవ్ విజృంభణ టైమ్ లో మెగా సాయం ఏది ? అంటూ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసింది మీడియా. ముఖ్యంగా సోషల్ మీడియాలో మెగా స్టార్ పై ఓ రేంజ్ లో సటైర్స్ పడ్డాయ్. 

ఆ ఎఫెక్ట్ నో లేక పక్కా ప్రణాఌక కారణమో.. చిరు ఎవరూ ఊహించని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలో ఆక్సిజన్ ట్యాంక్ ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వారం రోజుల్లోనే ఆ పని పూర్తి చేశారు కూడా. ఇందుకోసం దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేశారని సమాచారమ్. ఈ మొత్తం.. చిరు సొంత డబ్బు. ఎవరి దగ్గర విరాళాలు సేకరించలేదు. ఐతే మెగా సాయంపై మీడియాలో పెద్దగా ప్రచారం దక్కలేదు.

ఆంధ్రప్రభ పత్రిక మాత్రం చిరంజీవి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించడమే కాకుండా చిరంజీవి అభిమానుల ఆవేదన ని కూడా అక్షరీకరించింది. ఈ కథనం చిరంజీవి దృష్టి కి వచ్చింది. ఆదివారం సంచికలో ఆంధ్ర ప్రభలో ప్రచురితమైన ఈ కథనానికి కృతజ్ఞతలు చెప్పడానికి చిరంజీవి ఆంధ్రప్రభ హెడ్ ముత్తా గోపాలకృష్ణ తో సంభాషించారు. 

ఈ సందర్భంగా.. మీ సాయంపై మీడియాలో సరైన ప్రచారం దక్కలేదు. పైగా విమర్శలు వచ్చాయని ముత్తా గోపాలకృష్ణ అనగా..  ప్రస్తుతం మీడియా ఇలా ఉండడం మన ఖర్మ అని మెగాస్టార్ అన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్లకు ఉండొచ్చని , కానీ ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని మంచి అని చెప్పకపోగా దానిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ వార్తలు చేయడం బాధించిందని చిరంజీవి అన్నారు.