యాదాద్రి గర్భాలయ నిర్మాణం పై జీయర్ స్వామి సూచనలు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వామివారు కొలువైన గర్భాలయ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు వైటీడీఏ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలు సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఆలయ అధికారులు, స్తపతులు, వైటీడీఏ అధికారులు శుక్రవారం శ్రీవైష్ణవ పీఠాధిపతి చినజీయర్ స్వామిని కలిసారు. ప్రధాన ఆయలన నిర్మాణానికి సంబంధించిన ఆయన పలు సూచనలు చేశారు.
స్వయంభువులు నెలకొన్న బండరాతిపై శయన, స్థాన, స్థాపన నారసింహుల రూపులతో విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు జీయర్ స్వామి. గర్భాలయ వెనుక భాగంలో బలిహరణ, ప్రదక్షిణలకు వీలుగా ఆర్సీసీ నిర్మాణాలు తొలగించాలని చెప్పారు. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే స్వయంభువులను ఆనుకుని ఉన్న బండరాళ్లను తొలగించాలని సూచించారు. గర్భగుడి ముఖద్వారంపై ప్రహ్లాదుడి చరిత్ర వెండి కవచాల్లో లిఖించాలని స్తపతులకు సూచించారు.