డేటింగ్’కు గ్యాప్ లేదు.. అది సీక్రెట్ కాదు : శృతి

హీరోయిన్ శృతిహాసన్ ఏది దాచుకోదు. ఆఖరికి డేటింగ్ వ్యవహారం కూడా. ఆమె ఎవరితో డేటింగ్ లో ఉందో ఇట్టే తెలిసిపోదు. ఓపెన్ గా శృతినే చెప్పేస్తోంది. ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో శృతి డేటింగ్ చేస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్ లో గడిపారు. ఆ విషయాన్ని శృతినే తెలిపింది. తాజాగా డేటింగ్ పై శృతి స్పందించింది.

‘గతంలో నా డేటింగ్ వ్యవహారాల్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే, ఏదో ఒక టైమ్ లో నా ప్రేమ వ్యవహారాలు బయటకొస్తాయి. ప్రస్తుతానికైతే నా డేటింగ్ లైఫ్ గురించి మాట్లాడాలని లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సీరియస్ మేటర్ కాదు’ అని చెప్పుకొచ్చింది.30 ఏళ్ల నుంచే తన అసలైన జీవితం మొదలైందని.. నచ్చినట్టు బతకడం మొదలుపెట్టానని తెలిపింది.