యూకేలో కౌశ‌ల్ భార్య చేదు అనుభ‌వం

బిగ్‌బాస్ సీజ‌న్‌-2 విజేత కౌశ‌ల్ భార్య నీలిమకు యూకేలో చేదు అనుభ‌వం ఎదురైంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఇప్పుడీ.. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.  నీలిమ ఏదో ప‌నిపై లండ‌న్‌కు వెళ్లారు. అక్క‌డ కోవిడ్ బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్‌లో అందిస్తున్న ట్రీట్‌మెంట్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 

“నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఓ వ్య‌క్తి వ‌ల్ల ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్ బారిన ప‌డిన నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది.

నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వైద్యుల‌కు చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. అంత‌కు మించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా క‌రోనా ల‌క్ష‌ణాలు అట్లే ఉంటాయ‌ని, ఎదుర్కోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు” అని నీలిమ వాపోయారు.