అందుకే ఈటెల భాజాపాలో చేరుతున్నారు

ఆత్మరక్షణ, ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్‌ భాజపాలో చేరుతున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఈటెల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల క్రితమే తనకు సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ వచ్చిందన్నారు ఈటెల. తెరాసలో ఆత్మగౌరవం లేదన్నారు. ఇక ఈటెల ఆరోపణలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు తెరాస నేతలు.

మంత్రిగా ఉండి.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను వ్యతిరేకించడం ఏవిధంగా భావించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఐదేళ్లుగా పార్టీకి దూరంగా, అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందులకు గురి చేశారు. బెంజికార్లలో వచ్చే వారికి రైతు బంధు ఎందుకని ఈటల అంటున్నారు నిజమే. కానీ, ఈటల కుటుంబ సభ్యులు నాలుగేళ్లుగా రైతుబంధు సొమ్ము ఎందుకు తీసుకుంటున్నారు. ఈటల చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు.

2016లో ఓసారి ప్రగతిభవన్‌లోకి రానివ్వలేదని ఆరోపిస్తున్న ఈటల.. ఆత్మగౌరవానికి భంగం, అవమానం అని భావిస్తే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని ఎమ్మెల్సీ పల్లా ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఆత్మగౌరవం పేరుతో ఈటల వస్తున్నారని విమర్శించారు.