యాదాద్రి గోపురానికి స్వర్ణతాపడం…
యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామివారి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కృష్ణ శిలలతో ఆలయ గోపురాలు, ముఖమండపం, పన్నెండు మంది ఆళ్వార్ ప్రతిమలు, ఆలయ ప్రాకారాలు, సింహ రూప యాళీ స్థంబాలతో అత్యద్భుతంగా నిర్మితమవుతోంది యాదాద్రి ఆలయం. ప్రధాన ఆలయ గోపురానికి స్వర్ణతాపడం చేయాలని వైటీడీఏ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన బంగారాన్ని సేకరించి కరిగించారు.
బంగారం కరిగింపు ప్రక్రియ పూర్తయిన తరువాత స్వర్ణతాపడానికి కావాల్సిన టెక్నికల్ అంశాల పరిశీలనకు సమీక్షా సమావేశం నిర్వహించారు. విమాన గోపురానికి బంగారు పూతపూయడానికి డిఫెన్స్ మెటలాజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ టెక్నికల్ కమిటీతో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో సమీక్షా సమావేశంనిర్వహించారు. త్వరలోనే ఆ పనులను మొదలు పెట్టనున్నారు.