InternetShutdown : నిలిచిన ప్రముఖ వెబ్‌సైట్లు
నడుస్తున్నది ఇంటర్నెట్ కాలం. ఒక్క క్షణం నెట్ ఆగిపోయిన ప్రాణం పోయినంత పనైతయింది. మంగళవారం అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ వెబ్‌సైట్లకు ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో ఈ సైట్లు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్ సమస్యల కారణంగానే ఈ అంతరాయం నెలకొన్నట్లు ప్రాథమిక సమాచారం.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, బ్లూమ్‌బర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్‌తో పాటు అమెజాన్.కామ్, రెడిట్, క్వొరా, పే పాల్, హెచ్‌బీవో మాక్స్, హులు వంటి సైట్లకు కూడా ఈ సమస్య తలెత్తింది. ఈ సైట్లు ఓపెన్ చేస్తుంటే సర్వీస్ ఎర్రర్ చూపిస్తోంది. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే #InternetShutdown ట్రెండింగ్ టాప్ లో ఉంది.