ఆదిపురుష్ సంగీత దర్శకులు.. వీరే !

బాహుబలి ప్రభాస్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్‌ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసేది ఎవరనేది ఇప్పటి వరకు చిత్రబృందం చెప్పలేదు.

తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకులు సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు ఈ సినిమాకి పనిచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరు గతంలో ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రంలోని ”సైకో సైయాన్” అనే పాటకి సంగీత స్వరాలు అందించారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి భూషణ్ కుమార్‌, కిషన్‌ కుమార్‌ నిర్మాతలు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్ తెరకెక్కుతోంది.