చిన్నది వెతికితే.. పెద్దది తగిలింది !
ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ‘తేజ్ ఐ లవ్ యూ’ తర్వాత అనిపించకుండా పోయాడు. ఇక టాలీవుడ్ అతడిని మర్చిపోతోందనుకుంటున్న తరుణంలో.. మళ్లీ టచ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఓ ఆసక్తికరమైన కథని రెడీ చేసుకొన్న కరుణాకరన్.. ఆ కథని ఓ యంగ్ హీరోకి చెప్పి ఓకే చేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇంతలో అతడికి బడా పిలుపు వచ్చినట్టు సమాచారమ్. ఓ బడా హీరో ‘ఫ్యామిలీ కథలేమైనా ఉంటే చెప్పు..’ అని కరుణాకరన్ ని పిలిపించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏది ఓకే అయినా డార్లింగ్ డైరెక్టర్ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించడం ఖాయం.