పవన్ సినిమా టైటిల్ పై మైత్రీ క్లారిటీ

‘గబ్బర్ సింగ్’ కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించనున్న రెండో సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ సినిమా టైటిల్ గురించీ, క‌థాంశం గురించి ప‌లు గాసిప్పులు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిలో ఏది నిజం, ఏది కాదో తెలియక పవన్ ఫ్యాన్స్ కన్ఫూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ స్పందించింది. 

ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్ని న‌మ్మొద్ద‌ని కోరింది.’ఉగాదికే టైటిల్ ని, ఫ‌స్ట్ లుక్‌నీ వ‌దులుదామ‌నుకున్నామ‌ని, అయితే… పరిస్థితులు అనుకూలించ‌లేద‌ని తెలిపింది. ఈ సినిమా టైటిల్ ని ఓ శుభ‌ముహూర్తాన్న ప్ర‌క‌టిస్తామ‌ని, క‌చ్చితంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తామ‌ని మైత్రీ ట్వీట్ చేసింది.