ఎల్జీ కార్యాల‌యానికి ఎన్డీఏయేత‌ర ముఖ్య‌మంత్రుల లేఖ‌

ఢిల్లీ ఏపీ భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌మావేశ‌మైన ఎన్డీఏ యేత‌ర ముఖ్య‌మంత్రులు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి లేఖ రాశారు. కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తు తెలిపేందుకు అంద‌రూ క‌లిసి వెళ్లాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో అనుమ‌తి కోసం ఎల్జీ కార్యాల‌యానికి లేఖ‌ను పంపారు. ఏపీ భ‌వ‌న్ నుంచి కాలిన‌డ‌క‌న ఎల్జీ కార్యాల‌యానికి వెళ్లి కేజ్రివాల్ ను క‌లిసి మ‌ద్ద‌తు తెలుపుతారు. కాలిన‌డ‌క‌న ఎల్జీ కార్యాల‌యానికి వెళ్లే ముందు కేజ్రీవాల్ భార్య‌ను ప‌రామ‌ర్శించాల‌ని, ఒక‌వేళ ఎల్జీ కార్యాల‌యానికి వెళ్లేందుకు అనుమ‌తి నిరాక‌రిస్తే ఏం చేయాల‌నేదానిపై కూడా స‌మావేశంలో సీరియ‌స్ గా చ‌ర్చిస్తున్నారు.