కరోనాకు చికిత్స.. పన్ను ఉపశమనం ఎంత ?

ఈ నెల 12న భేటీ కావాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కరోనా చికిత్సకు అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

మే 28న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు కరోనాకు చికిత్సకు వాడే సామగ్రి అయిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని కోరారు. అయితే, ఈ సామాగ్రిపై పన్ను మినహాయించే అంశంపై అధ్యయనానికి కేంద్ర ఆర్థికశాఖ మేఘాలయా ముఖ్యమంత్రి కన్నాడ్‌ సంగ్మా నేతృత్వంలో ఓ మంత్రివర్గ సంఘాన్ని (GoM) ఏర్పాటు చేసింది. మంత్రుల బృందంతో కూడిన ఈ సంఘం జూన్‌ 7న నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో 12న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ జరగనుంది. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్లపై 5శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లపై 12శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దాన్ని ఎంత వరకు తగ్గిస్తారన్నది 12న తెలవనుంది.