భార్య ఎఫైర్ ని బయటపెట్టిన నటి భర్త
టైటిల్ చూసి కన్ఫూజ్ కాకండి. నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇన్నాళ్లకు మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలని బయటపెట్టాడు. కవితకు తన చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు. దీంతో రాజ్‌కుంద్రా విడాకుల వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
రాజ్ కుంద్రా ఏం చెప్పారంటే ? ‘నా మొదటి భార్య కవితతో విడిపోవడానికి శిల్పాశెట్టి అస్సలు కారణం కానేకాదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం. కొన్నేళ్ల క్రితం మేము లండన్‌లో నివాసం ఉన్నాం. నా తల్లిదండ్రులతోపాటు చెల్లి, ఆమె భర్త కూడా మాతోనే ఉండేవారు. దాంతో.. కవితకు నా చెల్లెలి భర్తతో రిలేషన్‌షిప్ పెరిగింది.
బిజినెస్ పనులపై నేను ఎప్పుడైనా టూర్‌కి వెళ్తే.. కవిత ప్రవర్తన మారేది. నా చెల్లెలి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. రహస్యంగా ఒక సెల్‌ఫోన్‌ని కొనుగోలు చేసి దాని నుంచి అతనికి తరచూ మెస్సేజ్‌లు చేసేది. ఆ ఫోన్ ఒకసారి నా కంట పడింది. అందులో ఉన్న మెస్సేజ్‌లు చూసి నా హృదయం ముక్కలైంది. దాంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అంనతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’ అన్నారు.