గుడ్ న్యూస్ : కరోనా చికిత్స కోసం బ్యాంక్ లోన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్-19 చికిత్స కోసం రుణం కావాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కవచ్ పేరుతో వ్యక్తిగత రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గరిష్ఠంగా రూ.5లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేని రుణాన్ని ఇస్తోంది. దీనికి 8.5శాతం వడ్డీగా నిర్ణయించింది.
వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల చికిత్స ఖర్చుకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఈ రుణానికి 60 నెలల వ్యవధి ఉంటుందని, ఇందులోనే మూడు నెలల మారటోరియం ఇస్తున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. కరోనాతో ప్రయివేటు హాస్పటల్స్ లో చేరితే లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. సడెన్ గా డబ్బు సర్థుబాటు చేయలేని వారికి ఎస్ బీఐ లోన్ ఆదుకోనుంది.