యాదాద్రికి సీజేఐ

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ రేపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. శనివారం సీజేఐను సీఎం కేసీఆర్‌ కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాదాద్రి సందర్శించాలని కోరగా.. ఆయన ఓకే అన్నారు.

ఆదివారమే సీజేఐతో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ యాదాద్రికి వస్తారని అనుకున్నారు. కానీ సోమవారం సీజేఐ ఒక్కరే యాదాద్రి దర్శణానికి రానున్నారని దేవాలయ వర్గాలు తెలిపాయి.