‘స్టార్ కార్డ్’ తీసేసిన సామ్

పెళ్లితో హీరోయిన్ల పనైపోయినట్టే అంటారు. కానీ పెళ్లి తర్వాత మరింత పవర్ ఫుల్ గా తయారైంది సమంత. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకుంది. అయితే ఇప్పుడు స్టార్ కార్డ్ మొత్తానికే తీసేసింది సామ్. స్టార్ హీరోల సినిమాలు, కమర్షియల్ కథలని నో చెబుతోంది. 

ఈమ‌ధ్య మైత్రీ మూవీస్ స‌మంత‌ని సంప్ర‌దిస్తే నిర్మొహ‌మాటంగా నో చెప్పింద‌ట‌. మైత్రీలోనే స‌మంత రంగ‌స్థ‌లం చేసింది. అందులోని రామ‌ల‌క్ష్మి పాత్ర స‌మంత‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అయినా స‌రే… మైత్రీ ఇచ్చిన ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించింది. పెద్ద హీరోల సినిమాల‌కు కొంత కాలం దూరంగా ఉండాల‌న్న‌ది స‌మంత తాజా నిర్ణ‌య‌మని తెలుస్తోంది.ఇప్పుడు స‌మంత దృష్టి పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, లేడీ ఓరియెంట్ క‌థ‌లనే ఎంచుకుంటోంది. నటిగా తనలోని అన్ని కోణాలని చూపించే ప్రయత్నంలో తీసుకొన్న నిర్ణయం ఇదని తెలుస్తోంది.