భాజాపాలో చేరిన ఈటెల.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు !

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భాజాపాలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కమలం కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు.

ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ.. “తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించాం. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే మంచిది కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్‌. 90 సీట్లు గెలిచి సంపూర్ణ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా 3 నెలలు కేబినెట్‌ రూపొందించలేదు. సంపూర్ణ మెజారిటీ ఉన్నా కేసీఆర్‌ ఫిరాయింపులు ప్రోత్సహించారు. కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్‌ మనస్తత్వం. నేనొక్కడినే పాలిస్తే బాగుంటుందని భావించే వ్యక్తి కేసీఆర్. ఏనాడూ ప్రజాస్వామ్య వేదికలను ఆయన గౌరవించలేదు.”  అన్నారు.