సుశాంత్ మళ్లీ రావా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ మరణించి సోమవారంతో యేడాది పూర్తయింది. ఈ సందర్భంగా సుశాంత్ జ్ఝాపకాలని నెమరు వేసుకుంది బాలీవుడ్. నివాళులు అర్పించింది. ఇక రియా చక్రవర్తి తన ప్రియుడు సుశాంత్‌ను తలచుకొంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
“నువ్వు ఇక్కడ లేవన్నది నేను నమ్మకలేకపోతున్నా. కాలమే అన్నింటినీ మాన్పుతుందని అందరూ అంటున్నారు. కానీ.. నువ్వే నా సమయం, సర్వస్వం. నన్ను ఇప్పుడు సంరక్షిస్తుంది కూడా నువ్వే అని నాకు తెలుసు. చంద్రుడి మీద నుంచి టెలిస్కోప్‌తో నన్ను చూస్తున్నావనీ తెలుసు. నన్ను తీసుకెళతావని నేను నీ కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నా. అణువణువూ వెతుకుతున్నా. నువ్వు నాతోనే ఇక్కడే ఉన్నావు. నిన్ను తలచుకున్న ప్రతిసారీ నా గుండె ముక్కలైపోతోంది. నువ్వు లేవనే బాధ నా శరీరాన్ని దహిస్తోంది.
ఇది రాయడానికి నా హృదయం ఎంతో వేదన అనుభవిస్తోంది. నువ్వు లేకుండా జీవితం లేదు. జీవిత అర్థాన్ని నువ్వు నీతో తీసుకెళ్లిపోయావు. నువ్వు లేని ఈ శూన్యత పూరించలేనిది. ప్రియతమా.. నీకు మల్పువా (ఒక రకమైన తిను బండారం) ఇస్తానని, ఈ ప్రపంచంలోని అన్ని ఫిజిక్స్ పుస్తకాలు చదువుతానని మాటిస్తున్నా. దయచేసి మళ్లీ తిరిగి నా దగ్గరికి రావా. ఐ మిస్ యూ మై బెస్ట్ ఫ్రెండ్. మై మ్యాన్. మై లవ్” అంటూ రియా ఎమోషనల్ అయింది.