ఈటెల.. వామపక్ష సిద్ధాంతాలు ఏమయ్యాయ్ ?
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరచుకుపడుతున్నారు. కేసులకు భయపడే ఈటెల బీజేపీలో చేరారని విమర్శిస్తున్నారు.
రాజకీయ ఆరోపణలకు దూరంగా ఉండే మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగారు. ఈటల వామపక్ష సిద్ధాంతాలు ఏమయ్యాయని.. ఏం ఉద్ధరించడానికి భాజపాలో చేరారని ప్రశ్నించారు. తెలంగాణకు భాజపా ఏం చేసిందని కడియం నిలదీశారు.
మరోవైపు తనతో పాటు సీఎం కేసీఆర్, పార్టీపై అసంతృప్తిలో ఉన్న నేతల్లో మంత్రి హరీష్ రావు, కడియం శ్రీహరి.. తదితరులు ఉన్నారని ఈటెల చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లే ఈటెలపై విమర్శలు చేస్తున్నరు. బహుశా.. ఈటెల బయటికొచ్చాక.. పార్టీలో వారికి ప్రాధాన్యత పెరిగినట్టు కనిపిస్తోంది. ఈటెల ఎఫెక్ట్ తో అసంతృప్తులని తృప్తి పరిచే కార్యక్రమం పెట్టుకున్నారు కేసీఆర్.