రెండేళ్ల గ్యాప్ తర్వాత పుష్ప 2 ?

సింగిల్ సినిమాగా సెట్స్ పైకి వెళ్లిన ‘పుష్ప’ డబుల్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప రెండు భాగాలుగా రాబోతుంది. ఈ యేడాదిలోనే పుష్ప వన్ రిలీజ్ అన్నారు. కానీ అది కుదరకపోవచ్చు. 2022 సంక్రాంతి కో, సమ్మర్ కో పుష్ప వన్ రావొచ్చు. ఆ వెంటనే పుష్ప 2 వచ్చే అవకాశాల్లేవ్. ఎందుకంటే ? పుష్ప వన్ తర్వాత బన్నీ మరో సినిమా చేయనున్నారు. పుష్ప వన్, పుష్ప 2 కి నడుమ బన్నీ వేరే సినిమా చేస్తారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బన్నీ స్నేహితుడు బన్నీ వాస్ చెప్పిన సంగతి తెలిసిందే. 

ఈ లెక్కన 2022 సంక్రాంతి కో, సమ్మర్ కో పుష్ప వస్తే, 2023 చివరికో, 2024 కో పుష్ప 2 వస్తుందన్నమాట. ఇక పుష్ప వన్ తర్వాత బన్నీ ఐకాన్ సినిమా చేసే అవకాశం ఉంది. ఈ టైమ్ లో సుకుమార్ ఏం ఖాళీగా ఉండడు. ఆయన బన్నీ సన్నిహితుడు కేదార్ కు ఓ సినిమా చేయడానికి సుకుమార్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తానికి… బాహుబలి 2 మాదిరిగా పుష్ప 2 కోసం ప్రేక్షకులు యేళ్లపాటు ఎదురు చూపులు తప్పవ్. ఇక పుష్ప వంద కేజీఎఫ్ లతో సమానమని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు చెప్పిన సంగతి తెలిసిందే.