ఢిల్లీలో ప్రారంభమైన నీతిఆయోగ్ సమావేశం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతీఆయోగ్ నాల్గో గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గతేడాది నీతి ఆయోగ్ చేపట్టిన చర్యల పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలపై గవర్నింగ్ కౌన్సిల్ చర్చించనుంది.
నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంపై చర్చించనున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి , రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశంలో సీఎం వివరిస్తారు.. దేశంలో ఎక్కడాలేని విధంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం, 24గంటల ఉచిత విద్యుత్ అంశాలు సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభజన హామీలపై చర్చించారు. ప్రత్యేక హోదా పోలవరం పై ఈ సమావేశంలో చర్చించారు.