తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు
కరోనాతో ఖజానాకు భారీగా గండి పడటంతో కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా భూముల మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే ఖజానాకు ఆదాయం రావడంతో పాటు రియల్ ఎస్టేట్ బ్లాక్ దందాకు కూడా చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. భూములు మార్కెట్ వ్యాల్యూపై త్వరలోనే అడిషనల్ కలెక్టర్ల నేతృత్వంలో కమీటీని వేయనుంది.
మరోవైపు నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. కోకాపేట్ , ఖానామెట్ లోని 64 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలని నిర్ణయించింది. ఈ-వేలం ద్వారా పారదర్శంగా భూములను విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16 వందల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.