ఈటెలతో ఢీ.. తెరపైకి కొత్త పేరు !
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజురాబాద్ చుట్టూనే తిరుతుతోంది. ఈటెల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానం నుంచి మళ్లీ నిలిచి గెలిచి.. సీఎం కేసీఆర్ అహంపై కొట్టాలనే కసితో ఈటెల ఉన్నారు. అదే తనకు జరిగిన అవమానానికి బదులు అని భావిస్తున్నారు.
మరోవైపు ఈటలని నుంచి ఓడించి.. గట్టి దెబ్బ కొట్టాలని గులాబీ దళం భావిస్తోంది. ఈటెలని ఓడిస్తే చాలు.. 2023లోనూ మరోసారి అధికారంలోకి వచ్చినట్టేనని లెక్కలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బలమైన నేతని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈటెలతో ఢీకొట్టబోయే తెరాస నేత కౌశిక్ రెడ్డి అని మొన్నటి వరకు వినిపించింది. ఆయన ఇటీవల మంత్రి కేటీఆర్ ని కలవడంతో ఈ ప్రచారం జరిగింది. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును టీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.