HCA : అజారుద్దీన్‌పై వేటు

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)లో వివాదం మరింత ముదిరింది. ఏకంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌నే తొలగిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసింది.

టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని విమర్శలున్నాయి. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలొచ్చాయ్. ఏప్రిల్ 11న హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. ఈ సమావేశంలో అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీ పైనే ఘర్షణ జరిగింది.