భయం కాన్సెప్ట్’కు మంచిరోజులు !

భయం కాన్సెప్ట్’కు మంచిరోజులు వచ్చాయ్ అంటున్నారు దర్శకుడు మారుతి. మారుతి కాన్సెప్ట్ కథల స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసింది. మతిమరుపు తో తీసిన ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అతి శుభ్రతతో వచ్చిన ‘మహానుభావుడు’ హిట్ అయ్యాడు. అతి మంచితనంతో ‘బాబు బంగారం’, అతి ఇగోతో వచ్చిన ‘శైలజరెడ్డి అల్లుడు’ సినిమాలు పర్వాలేదనిపించాయ్.

ఓటీటీల కాలం వచ్చినా.. మారుతి కాన్సెప్ట్ లని మాత్రం వదలడం లేదు. అతి భయం కాన్సెప్ట్ తో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో, మెహరీన్ హీరోయిన్. అయినదానికీ, కాని దానికీ భయపడే ఓ పెద్దాయిన కథతో తెరకెక్కుతోంది. ఆ పెద్దాయినా అజయ్ ఘోష్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సాఫ్ట్ టైటిల్ ఫిక్స్ చేసారు. భయం కాన్సెప్ట్ కు ఇలాంటి సాఫ్ట్ టైటిల్ ని పెట్టడం విశేషం.