TRSకు ప్రశాంత్ కిషోర్ సేవలు
వందశాతం సక్సెస్ శాతం కలిగిన రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన ఎక్కడికి వెఌతే.. అక్కడ విజయమే. సాధారణ విజయం కాదు.. ఘన విజయం. 2014లో మోడీని గద్దెనెక్కించడం లో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక 2019లో వైసీపీ కోసం పని చేశారు ప్రశాంత్ కిషోర్. వైఎస్ జగన్ ని సీఎం చేశారు. తాజాగా మమతా బెనర్జీ, స్టాలిన్ లను గద్దెనెక్కించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలు అందించబోతున్నారని సమాచారమ్.
తెలంగాణలో భాజాపా బలపడింది. తెరాసకు సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు భాజాపాలో చేరుతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి ఈటెల భాజాపాలో చేరారు. రోజురోజుకి తెలంగాణలో భాజాపా బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాజాపా రాజకీయ వ్యూహాలను తట్టుకొని మూడోసారి గట్టెక్కాలంటే ప్రశాంత్ కిషోర్ సేవల అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ ప్రముఖులు భావిస్తున్నట్లు సమాచారం.
అంతే కాకుండా ప్రశాంత్ కిషోర్ రాబోయే లోక్ సభ ఎన్నికలలో బిజెపి యేతర పక్షాలను మమతా బెనర్జీ సారథ్యంలో ఒక తాటిపైకి తెచ్చి ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రశాంత్ కిషోర్ తో అవగాహన కుదిరిన పక్షంలో టీఆర్ఎస్ కూడా ఆ బీజేపీయేతర కూటమిలోకి వచ్చినట్లే అనుకోవాలి. అయితే తన నేతృత్వంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన కేసీఆర్.. దీదీ కెప్టెన్సీలో పనిచేయడానికి ఒప్పుకుంటారా ? అన్నది చూడాలి.